ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ( మంగళవారం ) దూలం నాగేశ్వరరావు వైసీపీ పార్టీ తరపున కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమానులు, కార్యకర్తల మధ్య నామినేషన్ దాఖలు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మా కార్యకర్తలను డబ్బు సంచులతో అవతలి పార్టీ వారు కొంటున్న కార్యకర్తల్లో మాత్రం ఎటువంటి భిన్న అభిప్రాయాలు లేకుండా జగనన్న ఇచ్చిన సంక్షేమాలకు ముగ్దులై ఇంత మంది కార్యకర్తలు నా నామినేషన్లో పాల్గొనడం జరిగిందన్నారు. ఎవరు రెడ్ బుక్ మీద, బ్లాక్ బుక్ మీద రాసుకున్న జూన్ 4వ తేదీన తేలుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమో.. గూస్ బంప్స్ పక్కా!
కాగా, కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. మా హయాంలో కైకలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. నియోజకవర్గంలో తాగటానికి మంచి నీరు సౌకర్యంతో పాటు సీసీ రోడ్లతో పాటు జగనన్న గ్రీన్ విలేజ్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. కైకలూరు ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు అందించడంలో నా వంతు కృషి చేశానని దూలం నాగేశ్వరరావు తెలిపారు.