Duvvada Srinivas: వాలంటీర్లపై వైసీపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజీనామా చేస్తేనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.. కొన్నిసార్లు విపక్ష నేతలు.. మరికొన్నిసార్లు అధికార పక్షం నుంచి వాలంటీర్లపై చేస్తున్న కామెంట్లు వివాదాస్పదంగా మారుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ జాబితాలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్.. ఈ నెల 10వ తేదీన వాలంటీర్ల విధులపై హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కాదు.. మేం చెప్పిన మాటలు వినని, రాజీనామాలు చేయని వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని.. వారి స్థానంలో మరొకరు వస్తారంటూ హెచ్చరించారు. టెక్కలిలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వాలంటీర్ల రాజీనామాలపై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసిన విషయం విదితమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు అయ్యాయి.
Read Also: MLC By Election: నేటి నుంచి 9వ తేదీ వరకు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!