NTV Telugu Site icon

KotamReddy Sridhar Reddy: త్వరలో ప్రభుత్వాన్నే ప్రజలు సస్పెండ్ చేస్తారు

Kotamreddy Phone Tapping

Kotamreddy Phone Tapping

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో నా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం.అసెంబ్లీ చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించాలి. నెల్లూరు రూరల్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఈ సమస్యలపై నాలుగేళ్లుగా మట్లాడుతూనే ఉన్నాను. ప్రభుత్వం దృష్టికి తేవడం ద్వారా సమస్యలపై పరిష్కరించే ప్రయత్నం చేశాను. ప్రజా సమస్యలపై మాట్లాడతానని నేను కోరితే నాకు అవకాశం ఇవ్వలేదు. నన్ను తిట్టించేందుకు ఇద్దరు మంత్రులకు ఇరవై నిమిషాల సమయం ఇచ్చారు. ఇవాళ సభ జరుగుతున్నంత సేపు నిలబడే గాంధీగిరీ పద్దతిలో నిరసన తెలిపాను.

Read Also:Student Suicide: మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థిని ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో ఘటన

టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత నా దగ్గరకు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి నా వద్దనున్న ప్లకార్డు లాక్కుని చించేశారన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇదేం దాదాగిరి అని స్పీకరును అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. నన్ను స్పీకర్ తాత్కాలికంగా సభ నుంచి సస్పెండ్ చేశారు.కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారన్నారు కోటంరెడ్డి.

Read Also: Ap High Court: ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాల్సిందే