Site icon NTV Telugu

YSRCP: మూడో లిస్ట్‌పై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు

Ysrcp

Ysrcp

YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికే కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫస్ట్‌, సెకండ్‌ లిస్టులను పార్టీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్‌పై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Read Also: MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్‌..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!

ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చారు. గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు సెగ్మెంట్‌లో ప్రత్యామ్నాయం పార్టీ హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. దీంతో పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విఙప్తి చేస్తున్నారు. సీఎంఓకు మైలవరం ఎమ్మెల్యే వసంత, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డి వచ్చారు.  సీఎం క్యాంపు కార్యాలయానికి దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చారు. పలు నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పులపై  సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2,3 రోజుల్లో 15 మందితో మూడో లిస్టును వైసీపీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్పులపై వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేరు ఉంటుందోనని ఉత్కంఠ ఉంది.

మూడో లిస్ట్ పై ఉత్కంఠ.. LIVE | Third List Tension in YCP | CM Jagan | Ntv

Exit mobile version