Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళా అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని దుశ్శాసన పర్వం కొనసాగించారని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న సంఘటనలు ప్రతిచోటా జరుగుతున్నాయన్నారు. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదని.. చంద్రబాబు ఇక పోటీ చేసి గెలిచే అవకాశం లేదన్నారు. నామినేషన్లు వరకు రాకుండా అడ్డుకుంటున్నారని.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నామినేషన్లు వేసే పరిస్థితికి ఏపీలో వచ్చిందని మండిపడ్డారు. 18 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈరోజు 20 మంది పోలీసులు సమక్షంలో జిల్లా కలెక్టరేట్‌లో అందించారని తెలిపారు. పోలీసులు ఉన్న చోట సంఘ విద్రోహులు నామినేషన్లు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాళ్ళతో ఒప్పందం చేసుకున్న కారణంగానే ఈరోజు ప్రశాంతంగా నామినేషన్లు వేయగలిగారని.. 50 మంది పోలీసులు ఉన్నా ఒక్కరు నామినేషన్ కూడా ఇంతకుముందు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు.

పోలీసులు అనుకుంటే ఏదైనా సాధ్యమే. 2004కు ముందు 10 ఏళ్లుగా చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని ఓ డీజీపీ స్థాయి అధికారి తనతో చెప్పారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. “కోడూరు బాల సుబ్రమణ్యం నందలూరులో తన గన్‌తో స్వైర విహారం చేశారు. లైసెన్సు తుపాకీ ఉంటే ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకోవాలి. అతని వెపన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇది రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. పోలీసులు వాళ్లే రౌడీలకు భద్రత కల్పిస్తున్నారు, గూండాలకు భద్రత కల్పిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 4 గురు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుంటే చంపుతామని బెదిరిస్తున్నారు.” అని వ్యా్ఖ్యానించారు.