MP Vijayasai Reddy: వైసీపీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకూ అందరినీ గౌరవంగా చూసుకుంటామని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవన్నారు. ఇతర కారణాల వల్ల పార్టీలను వీడటం రాజకీయ నాయకులకు ఎన్నికల ముందు సర్వ సాధారణమని.. నేతలు మారినా పార్టీలు కొనసాగుతాయని.. ఇదంతా నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. టీడీపీని వీడి గొల్లపల్లి సూర్యారావు, కేశినేని నాని వైసీపీలోకి వచ్చారని ఈ సందర్భంగా చెప్పారు.
Read Also: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల తర్వాత ఏ పార్టీ బలం ఎంత..? బీజేపీ మెజారిటీ సాధించిందా..?
తెలుగుదేశం, జనసేన నుంచి కూడా చాలామంది వెళ్లిపోతున్నారని.. పార్టీలు మారటానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. చరిత్ర పుటల్లో నిలిచే విధంగా మేదరమెట్ల సిద్దం సభ ఉండబోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో జరగని విధంగా ఈ సభ జరగబోతుందన్నారు. గతంలో, భవిష్యత్తులో ఇలాంటి సభ ఇక జరగదన్నారు. 15 లక్షల మందికి పైగా సభకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.