Vijaya Sai Reddy: మరో సారి వైసీపీ గెలవాలి.. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన కొనసాగాలి అని ఆకాక్షించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. పల్నాడు పర్యటనలో ఉన్న ఆయన.. మంచి చేసిన ప్రభుత్వ పని తనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు. అణగారిన వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకు రావాలనేదే ప్రభుత్వ ప్రయత్నం.. అగ్ర కులాలలో పేదలకు కూడా ప్రభుత్వ సాయం అందుతుంది.. ప్రతి వర్గానికి మేలు చేయాలని ప్రభుత్వం పని చేసిందన్నారు.
Read Also: CM KCR: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు నిలబడితే గెలవాలంతే..! కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
2019 కంటే బలంగా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలన్నారు విజయసాయిరెడ్డి.. గ్రామాల నుంచి ప్రజా వేదికల వరకు అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశామన్న ఆయన.. 2019కు ముందు తలసరి ఆదాయం, ఇప్పటి తలసరి ఆదాయం పరిగణలోకి తీసుకోవాలన్నారు. వైసీపీ, సీఎం వైఎస్ జగన్ అధ్వర్యంలో విద్యా వైద్యానికి పెద్ద పీట వేశాం.. భవిష్యత్ లో పోర్టులు, నూతన రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. మరో సారి వైసీపీ గెలవాలి, సుభిక్ష పరిపాలన కొనసాగాలంటూ పిలుపునిచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కాగా, ఇక ఎన్నికల సమయం ఉన్నా ఏపీలో వైసీపీ వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్తున్న విషయం విదితమే.. ఓ వైపు యాత్రలు.. మరోవైపు పర్యటనలతో నేతలు బిజీబీజీగా ప్రజల మధ్యే గడుపుతున్నారు.