Site icon NTV Telugu

R Krishnaiah Resigns: వైసీపీకి బిగ్ షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా

R Krishnaiah

R Krishnaiah

R Krishnaiah Resigns: వైసీపీకి మరో బిగ్‌ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేయగా.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు. ఆర్ కృష్ణయ్య స్థానం ఖాళీ అయిందంటూ రాజ్యసభ సెక్రటరీ బులిటెన్ విడుదల చేశారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేయడం గమనార్హం. ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు, మోపిదేవి వెంకటరమణలు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో గతంలో 11 మంది వైసీపీ తరఫున ఎంపీలు ఉండగా.. మొత్తం ముగ్గురు రాజీనామాలు చేశారు. ముగ్గురు రాజీనామా చేయడంతో వైసీపీ రాజ్యసభ ఎంపీల సంఖ్య 8కి పడిపోయింది.

Read Also: GANJA: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

Exit mobile version