Margani Bharat: టీడీపీ నేత నారా లోకేష్‌పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం నల్లజర్ల సొసైటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడారు. ప్రజల కోసం చేసేదాన్ని పాదయాత్ర అంటారు గాని.. ఒళ్లు తగ్గించుకోవడానికి చేసేదాన్ని పాదయాత్ర అనరంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలు పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో చేసే యాత్రను ఏమంటారో నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు.
Also Read: Hyderabad: ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం.. అక్కా తమ్ముడిపై కత్తితో దాడి
గూగుల్‌లో పప్పు అని కొడితే నారా లోకేష్‌ను చూపిస్తుందని.. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా మంత్రిగా అయిన నారా లోకేష్ తన పదవి కాలంలో ఏం సాధించారో చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేయలేని పథకాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో పోటీ 20 లక్షల మంది మహిళలు ఉండగా.. వారిలో బీపీఎల్ కింద 80 లక్షల మంది వస్తారని, వారందరికీ ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందిస్తారా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పాలన్నారు. పెన్షన్‌కు, ఇన్సూరెన్స్ పథకానికి తేడా తెలియని నారా లోకేష్‌కు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదని ఎంపీ భరత్ మండిపడ్డారు.