NTV Telugu Site icon

MLC Vamsi Krishna: వైసీపీకి మరోషాక్‌.. నేడు జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీ..!

Mlc Vamsi Krishna

Mlc Vamsi Krishna

MLC Vamsi Krishna: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి.. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులున్నాయి.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇక, విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.. దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కాబోతున్నారు ఎమ్మెల్సీ వంశీ.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ జనసేనలో చేరబోతున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే సమయంలో ఆయన పవన్‌తో భేటీకానుండడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది..

Read Also: Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!

ఇక, జనసేన పార్టీలో చేరేందుకు ఇప్పటికే తన వర్గం కార్పొరేటర్లతో వంశీ మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి పోటీ చేయాలనే ప్లాన్‌లో వంశీ ఉన్నాడని.. అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చాక.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అయినట్టు ప్రచారం సాగుతోంది.. మరోవైపు, వంశీ కృష్ణపై సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండడంతో.. నిన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు.. వంశీని కలిసి చర్చలు జరిపాడు.. పార్టీ మారే ఆలోచన లేదని వంశీకృష్ణ తనకు చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.. దీనిపై మాత్రం వంశీ కృష్ణ స్పందించలేదు.. కానీ, నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ వెళ్తారని.. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, ఈ రోజు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌.. జనసేన కండువా కప్పుకుంటారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Read ALso: Raviteja: హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్ వినిపిస్తాడు…

నియోజకవర్గంలో సంఖ్యాపరంగా బలంగా ఉన్న యాదవ సామాజికవర్గంలో ఆయనకు బలమైన స్థానం ఉన్నప్పటికీ, 2019 ఎన్నికలకు ముందు విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించడంతో పార్టీతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌కు విభేదాలు మొదలయ్యాయని చెబుతుంటారు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్ష పదవిని కట్టబటెట్టింది వైసీపీ.. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 21వ వార్డు నుండి కార్పొరేటర్‌గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, 11వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన జి.హరి వెంకట కుమారిని మేయర్‌గా పార్టీ ఎన్నుకోవడంతో ఆయన మళ్లీ నిరుత్సాహానికి గురయ్యారు.. మేయర్‌గా ఎన్నిక కాకపోవడంతో మనస్తాపానికి గురైన వంశీకృష్ణ.. నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మరియు కొంతమంది వైసీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం.. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.. కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.