NTV Telugu Site icon

Mohammad Iqbal: ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఎందుకు రాజీనామా చేశానంటే..?

Mohammad Iqbal

Mohammad Iqbal

Mohammad Iqbal: ఎన్నికల తరుణంలో హిందూపురం వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. శుక్రవారం రోజు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. సీఎం జగన్‌, మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను పంపించినట్టు పేర్కొన్న ఆయన.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ రోజు తన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడిస్తూ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపూర్ టికెట్ ఇవ్వనందుకు కాదు.. అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మైనారిటీలకు, పోలీసులకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదన్నారు. ఇక, 2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని ప్రకటించారు ఎమ్మెల్సీ ఇక్బాల్.

Read Also: Tirumala Darshan: వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!

కాగా, గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్‌ ఇక్బాల్.. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ తర్వాత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సీఎం జగన్‌.. కానీ, ఇటీవల హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించి.. దీపక అనే మహిళకు అప్పగించడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు ప్రచారం సాగింది.. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని తెలుస్తుండగా.. ఆయన ఎమ్మెల్యే పదవి కాలం మరో మూడేళ్లు ఉండగానే ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పడం చర్చగా మారింది.