Site icon NTV Telugu

MLA Vasupalli Ganesh Kumar: వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..

Mla Vasupalli Ganesh

Mla Vasupalli Ganesh

MLA Vasupalli Ganesh Kumar: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వైభవంగా సాగుతోంది.. కనుమ రోజు నాన్‌వెజ్‌ మార్కెట్లకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది.. చికెన్‌, మటన్‌, ఫిష్‌, నాటుకోళ్లు.. ఇలా వివిధ రకాల నాన్‌వెజ్‌ కొనుగోలు చేస్తున్నారు.. అయితే, ఇదే సమయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తలకు ఇచ్చిన కనుమ కానుక వివాదాస్పదంగా మారింది.. కళాశాలలో తమ కార్యకర్తలకు మద్యం, కోళ్లు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు చెందిన డిఫెన్స్ అకాడమీ.. కనుమ పండుగ సందర్భంగా ఈ మద్యం, కోళ్ల పంపిణీ చేయడమే దీనికి కారణం అయ్యింది.

Read Also: TS Government: పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసు.. ఏసీబీకి బదిలీ

అయితే, ఈ కళాశాల ను రామబాణం క్యాంపస్ అని కూడా అంటారు. డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్ల పంపిణీ చేస్తున్న వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.. అది కాస్తా వివాదంగా మారింది. ఈ పంపిణీ కోసం ముందు రోజే టోకెన్ లు పంపిణీ చేయడం మరో విశేషం. అసలు 400 మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. మద్యం పంపిణీ సమయంలో కళాశాలపై అంతస్తులో ఉన్న కార్యాలయం లోనే ఎమ్మెల్యే గణేష్ ఉన్నారని తెలుస్తోంది. కానీ, లిక్కర్, కోడి పంపిణీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారి వివాదం రేగడంపై ఎమ్మెల్యే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు.

Exit mobile version