Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో కీలకమైన రాజకీయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతోనే బలిజ నేత అయిన శ్రీనివాసులు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

Read Also: Adimulapu Suresh: పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్‌..

ఇదే సమయంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయనందా రెడ్డిని గెలిపించాలంటూ చిత్తూరు బలిజ సంఘం నేతలందరూ నగరంలో భారీ నిర్వహించి విజయనందా రెడ్డిని గెలిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇటు బలిజ ఎమ్మెల్యే పార్టీ మారడం.. ఇదే సమయంలో అత్యధిక ఓటర్లుగా ఉండే బలిజ సంఘం నేతలు విజయనందా రెడ్డికి మద్దతు పలకడం నగరంలో హాట్ టాపిక్ మారింది. ఇక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ లీడర్‌గా ఉన్న ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న సీకే బాబు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ గెలిపించాలని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version