Site icon NTV Telugu

AP Assembly: ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్

Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

AP Assembly: ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అసెంబ్లీలో మూడు కమిటీలకు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంస్థల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంచనాల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. అంతకు ముందు నామినేషన్‌ వేయడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ అధికారులు రెండు గంటల పాటు ఎదురుచూసేలా చేశారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Ram Gopal Varma: ఆర్జీవీపై వరుస ఫిర్యాదులు.. మరో కేసు నమోదు..

Exit mobile version