Nallapareddy: బాబు, పవన్‌కు మతిభ్రమించింది.. వాళ్లు సీఎంలు అయ్యేదే లేదు..!
Nallapareddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వాళ్ల పార్టీలు రెండూ అధికారంలోకి రావని వాళ్ల మనసులకు కూడా తెలుసన్నారు.. వాళ్లు ముఖ్యమంత్రులు అయ్యేదే లేదని వ్యాఖ్యానించారు.. ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీలకు అతీతంగా 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.. అయితే, ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
Read Also: Punjab Mother And Son: వరదలు తల్లీకొడుకులను కలిపాయి .. 35 ఏళ్ల క్రితం విడిపోయారు
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు మతిభ్రమించింది ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లపరెడ్డి.. వాళ్ల పార్టీలు రెండూ అధికారంలోకి రావని వాళ్లకే తెలుసు.. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. యాత్రలతో హీట్ పెంచుతున్నారు నేతలు. వారి మధ్య ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే.. అప్పుడే ఎన్నికలు వచ్చేస్తున్నాయా? అనేలా ఉంది పరిస్థితి.
తాజావార్తలు
-
Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
-
Iran: గంటలో 7 అబద్ధాలా.? ట్రంప్ వాదనలపై ఇరాన్ ఆగ్రహం..
-
IPL 2026-SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్.. సన్‌రైజర్స్‌లోకి ముంబై ఇండియన్స్ పేసర్!
ట్రెండింగ్
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?