NTV Telugu Site icon

Gadikota Srikanth Reddy: రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ మోసం.. మూడు సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు..?

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాట్‌ కామెంట్లు చేశారు.. మిడి మిడి జ్ఞానంతో లోకేష్ మాట్లాడుతున్నాడన్న ఆయన.. రాయించిన స్క్రిప్ట్ చదువుతూ వెళ్తున్నాడని సెటైర్లు వేశారు.. సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.. మిషన్ రాయలసీమ పేరుతో లోకేష్ నిర్వహించి కార్యక్రమం ప్రైవేట్ ఈవెంట్‌గా ఉందని ఎద్దేవా చేశారు.. రాయలసీమలో అభివృద్ధి అంటే వైఎస్‌ఆర్‌కు ముందు.. తర్వాత అని చూసుకోవాలని సూచించిన ఆయన.. టీడీపీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గండి కోట, హంద్రీ నీవా, గాలేరు నగరి అలాగే పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.. రాయలసీమ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడితే హక్కు టీడీపీకి లేదన్న గడికోట.. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తులుగా ముక్కు నేలకు రాసి ఇక్కడి ప్రజలకు తండ్రీ కొడుకులు క్షమాపణ చెప్పాలని సూచించారు.

రెండు రోజుల్లో రాయలసీమను వదిలి వెళుతున్న సందర్భంలో ఈ ప్రాంతానికి చేసిన మోసానికి, అన్యాయానికి మేమే బాధ్యత అంటూ చంద్రబాబును పిలిపించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు శ్రీకాంత్‌రెడ్డి.. పోతిరెడ్డి పాడు రాకుండా, సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అన్యాయం, ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా సినిమాలు తీయించి కించ పరిచి నందుకు క్షమాపణ చెప్పాలన్నారు.. ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ చేస్తామంటున్నారు.. కానీ, వైఎస్ఆర్ కడపలో స్పోర్ట్స్ స్కూల్ తెచ్చారని గుర్తుచేశారు.. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ లను 94లో పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్ లో నీటి కేటాయింపులు జరిగి ఉండేవి? కదా అని నిలదీశారు. పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తూంటే కోస్తా నాయకులతో లేఖలు రాయించారు.. ఇటీవల ప్రాజెక్టు పనులు చేపడిటే అడ్డుపడింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు.. అసలు, గతంలో మూడు సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రానికి ఏం చేశారు అని ఫైర్‌ అయ్యారు..

జనం మిమ్మలను నమ్మే పరిస్థితిలో లేరంటూ ఎద్దేవా చేశారు శ్రీకాంత్‌రెడ్డి.. కర్నూల్‌కు హైకోర్టు రాకుండా అడ్డుకొని ఇప్పుడు హైకోర్టు బెంచ్‌ పెడతామని చెప్పడం దారుణం అన్నారు. అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు.. కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, కుల రాజకీయాలు చేస్తున్నారు.. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ జనాన్ని మోసం చేస్తున్నారు.. కడప కొప్పర్తిం పారిశ్రామిక వాడలో నాలుగేళ్లలో వెయ్యి కోట్ల కేంద్ర నిధులు తెచ్చారని గుర్తుచేశారు.. రాయల సీమకు ఏమీ చేయకుండా ఇప్పుడు ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.. రాయలసీమకు చేసిన అన్యాయానికి ప్రజలకు క్షమాపణ చెప్పి తిరగాలని సవాల్ చేశారు.. వైసీపీ పథకాలను కాపి కొట్టి, ఆల్ ఫ్రీ బాబు అని చెప్పడం అవివేక చర్యగా ఎద్దేవా చేశారు శ్రీకాంత్‌రెడ్డి.. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మాట మార్చారు.. ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెబుతున్నారన్న ఆయన.. భాధ్యత లేని తండ్రీ కొడుకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. రాయలసీమలో అన్ని సామాజిక వర్గాలను మోసం చేసి మళ్లీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.