NTV Telugu Site icon

Anil Kumar Yadav: మగాళ్లయితే నేరుగా రండి.. ఆడాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కాదు..!

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav: సోషల్‌ మీడియాలో పోస్టులపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య వార్‌ నడుస్తూనే ఉంది.. ఎవరైనా ఏదైనా కామెంట్‌ చేశారంటే.. వారికి మద్దతుగా పోస్టులు పెట్టేవారు కొందరైతే.. వాటిని తప్పుబడుతూ పోస్టులు పెట్టేవారు మరికొందరు.. అంతేకాదు.. ఫేక్‌ ఐడీలతో సోషల్‌ మీడియాలో అసభ్యకమైన పోస్టులు పెట్టేవారు లేకపోలేదు.. అయితే, వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్.. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై ఓ రేంజ్‌లో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే.. ఐటీడీపీ తరపున ఫేక్ ఐ.డీ.లతో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.. మగాళ్లయితే నేరుగా రావాలి అంటూ సవాల్‌ చేశారు.

Read Also: Salman Khan: విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!

మగాళ్లయితే నేరుగా రండి.. చూసుకుందాం.. మీరో మేమో తేల్చుకుందాం.. కానీ, దొంగచాటుగా ఇంట్లోని మహిళలపై పోస్టులు పెట్టడం ఏంటిరా..? ఇది సరైన పద్దతేనా? అని మండిపడ్డారు అనిల్‌కుమార్‌ యాదవ్.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక దొడ్డి దారిన దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు.. మేం రాజకీయాల్లో ఉంటే మా ఇంట్లోని మహిళలు, పిల్లలు ఏం చేశారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోవారిని విధుల్లోకి లాగడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. మంత్రి ఆర్కే రోజాతో పాటు పలువురు మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు.. ఫేక్‌ ఐడీలతో సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.. వారిని వదిలిపెట్టేదే లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్.