NTV Telugu Site icon

YSRCP: ఎన్నికల కమిషన్‌ను కలిసిన వైసీపీ నేతలు.. హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు

Ap Ceo

Ap Ceo

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. ఇక, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేశారు.. ఏపీ సీఈవోను కలిసిన వైసీపీ నేతల బృందంలో అంబటి రాంబాబు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, పేర్ని నాని, అప్పిరెడ్డి తదితరులున్నారు..

Read Also: Drug Addict: డ్రగ్స్కు బానిసయ్యాడని తండ్రిని హత్య చేసిన కొడుకు..

ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. కేంద్ర పోలీసు పరిశీలకులు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నియమించినవ వ్యక్తి అని ఆరోపించారు.. పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతుంది.. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ నడుస్తుందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నారు.. అల్లర్లు జరగకుండా చూడాలని ఈసీని కోరామని వెల్లడించారు మంత్రి మేరుగ నాగార్జున.