విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు.
Read Also: Jammu Kashmir: అనంతనాగ్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం మీద సుత్తెలు, రాళ్ళతో దాడి చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ దాడి అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతున్నదని.. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తగలబెడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని.. ఏదో ఒకరోజు టీడీపీ ప్రభుత్వం కూడా కూలిపోతే, ఇదే దుష్ట సంప్రదాయాన్ని వైసీపీ కొనసాగిస్తే ఏమవుతుందో టీడీపీ నాయకులు ఆలోచించుకోవాలని అంబటి పేర్కొన్నారు. జరుగుతున్న దాడులపై హోంమంత్రి స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి డిమాండ్ చేశారు.
Read Also: Jr NTR Watch: ఎన్టీఆర్ చేతి వాచ్ తో హైదరాబాదులో మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనేయచ్చు తెలుసా?