పార్టీ పదవులు పొందిన కార్యకర్తలందరికీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.. పదవులు పొందిన వారందరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలు చేసింది జగన్ మాత్రమే అన్నారు.. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారన్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక నిపుణుడు అయినా చంద్రబాబు ఇవన్నీ ఎన్నికల ముందు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు లా అబద్దాలు జగన్ చెప్పలేడని… అందుకే ఓడిపోయామన్నారు. చంద్రబాబు తో జగన్ పోల్చుకోలేమన్నారు.. నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు తప్ప చంద్రబాబు ఏమీ చేయాలేదని విమర్శించారు.. రాష్ట్రంలో జరిగే అక్రమాలపై వైసీపీ కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు..
READ MORE: Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్
ఇదిలా ఉండగా.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ బాంబ్ పేల్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. 25వ తేదీన రాజ్యసభకు రాజీనామా చేశారు. అయితే, “ఏ రాజకీయపార్టీ లోను చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.” అని ఆయన పేర్కొన్న విషయం విదితమే..