Site icon NTV Telugu

Anna Rambabu: నామినేషన్ దాఖలు చేసిన అన్నా రాంబాబు

Anna Rambabu

Anna Rambabu

వైసీపీ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు ఇవాళ (సోమవారం) ఉదయం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, అంతకు ముందు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా ఆయన బీ-ఫామ్ తీసుకున్నారు. ఆ తర్వాత అన్నా రాంబాబు నామినేషన్ పండుగ రూట్ మ్యాప్ షెడ్యూల్ ప్రకారం.. సప్తగిరి లాడ్జి మీదుగా దోర్నాల బస్టాండ్, నాయుడు బజార్, రథం బజార్, రాజాజి స్ట్రీట్, రీడింగ్ రూమ్, కంభం రోడ్డు జంక్షన్, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీసుకు చేరుకుని ఉదయం 10. 30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.

Read Also: Mallikarjun Kharge : ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. కారణం ఇదే !

ఈ సందర్భంగా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్‌ వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌ అభిమానులు హాజరై తనను ఆశీర్వదించారని చెప్పారు. ఇక, మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను.. ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అన్నా రాంబాబు కోరారు.

Exit mobile version