వైసీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈనెల 5వ తేదీన వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు ర్యాలీకి అనుమతివ్వాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతివ్వాలని ఎన్నికల అధికారిని కోరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్ చెల్లించామని.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్లు చెల్లించకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 5న నిరసన కార్యకమాలను ఏర్పాట్లు చేసుకున్నారు. మండలి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. అందువల్ల నిరసన కార్యక్రమాలకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని లేఖలో కోరారు.
READ MORE: West Godavari District: అలర్ట్ కోళ్లకు సోకిన అంతుచిక్కని వైరస్.. రోజు వేల సంఖ్యలో మృత్యువాత