Vidadala Rajini: కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీరు ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మాజీ మంత్రి విడదల రజిని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనపై మీడియాతో మాట్లాడిన ఆమె.. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.. రోజురోజుకూ వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకంగా జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడారు.. ఆయన పార్టీలోని మరో నేత బుచ్చయ్యచౌదరి విచక్షణ మరిచి వైఎస్ జగన్‌కు హాని కలిగిస్తామనే రీతిలో దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు..
అయితే, ఇవ్వన్నీ చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు రజిని.. జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఎన్నోఆంక్షల ఉన్నప్పటికీ ప్రజలు పెద్దఎత్తున వచ్చి విజయవంతం చేశారు.. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పోలీసుల వేదింపులు తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రయత్నించింది.. జగన్ పర్యటనలో ఇద్దరు చనిపోయినా పట్టించుకోలేదని టీడీపీ వారు గగ్గోలు పెడుతున్నారు.. మరి గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార యావకు 29 మంది చనిపోయారు.. కందుకూరులో 8 మంది, గుంటూరులో ఉయ్యూరు పౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గురు మహిళలు చనిపోతే పట్టించుకోలేదని దుయ్యబట్టారు.. జగన్ ను భుస్తాపితం చెయ్యాలి అని చంద్రబాబు అంటున్నారు.. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది.. జగన్ ను లేకుండా చెయ్యాలని చూస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.. కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీరు ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అని స్పష్టం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మాజీ మంత్రి విడదల రజిని..
