YSRCP: నాలుగో జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం .. కొవ్వూరు మంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వనితను గోపాలపురానికి, గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తలారి వెంకట్రావు కొవ్వూరుకు మార్చింది. 2009లో టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాత కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరు నుంచి పోటీ చేశారు. 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన తానేటి వనిత.. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి మంత్రిగా ఉన్న ఆమె మరోసారి పోటీకి సిద్ధమవుతున్నా అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనిపించలేదు. వర్గ పోరు కామన్ గా ఉండే నియోజకవర్గం కావడంతో ప్రతి చిన్న విషయం అక్కడ చిలికిచిలికి గాలివానగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చారు. గతంలో గోపాలపురం నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈసారి ఎన్నికల్లో వనితకు గోపాలపురం నుంచి పోటీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని టార్గెట్ తో వైసీపీ కనిపిస్తుంది.
Read Also: Cyber Insurance : జీవిత బీమాను మరచిపోండి.. ఇకపై సైబర్ బీమా చేయించుకోండి
ఇక, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించడం, నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తూ గోపాలపురంలో తనకి ఉన్న పట్టు నిలబెట్టుకునే పనిలో ఉన్నారు తలారీ. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలతోపాటు, రహదారుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పేదల ఇళ్ళనిర్మాణంలో ఆలస్యం సమస్యగామారింది. ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో వైసీపీ అధిష్టానం ఈసెగ్మెంట్‌పై ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు తలారి చుట్టు ఉన్న వివాదాలను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆయన్ను గోపాలపురం నుంచి మార్చారు. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తలారి పోటీ చేయనున్నారు. మొదటినుంచి తానేటి వనిత వర్గానికి తలారి వెంకటరావు వర్గానికి గోపాలపురంలో బేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు మంత్రి వనితను ఇటు తలారి వెంకట్రావును వైసీపీ అధిష్టానం మార్చినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.