AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..

Ap High Court Ycp

Ap High Court Ycp

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. తన పిటిషన్‌లో వైసీపీ ప్రధానంగా పలు అంశాలను పేర్కొంది. తమ పార్టీ అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. వెంటనే అభ్యర్థులను విడుదల చేసి, వారు నామినేషన్లు వేసేందుకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, పత్రాలను చించేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు ఒడిగట్టిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కోరింది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నామినేషన్ల గడువును కనీసం 48 గంటల పాటు పొడిగించాలని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లలో నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌సీపీ హైకోర్టును అభ్యర్థించింది.