NTV Telugu Site icon

YSRCP vs TDP: మాజీ మంత్రి కారుమూరి ఇంటి వద్ద వైసీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం..

Ycp Vs Tdp

Ycp Vs Tdp

YSRCP vs TDP: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైసీపీ నేతలతో ఎన్డీయే కూటమి నాయకులు వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఎంపీటీసీలతో కలిసి మాజీమంత్రి కారుమూరి మండల పరిషత్ కార్యలయానికి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగాలంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కాగా, మొత్తం 18 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో వైసీపీకి 14 మంది ఎంపీటీసీలు ఉండగా టీడీపీ, జనసేన పార్టీలకు తలో రెండు ఎంపీటీసీలు ఉన్నారు.