Minister Taneti Vanitha: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి కూడా ఒకేసారి పోల్ నిర్వహించనున్నారు.. అయితే, రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గతంలో ఏ ప్రభుత్వం అందించిన విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు. టీడీపీ-జనసేన కలిసికట్టుగా వచ్చినా.. వైసీపీకి ఢోకా లేదన్నారు.. టీడీపీ-జనసేన ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాయని మండిపడ్డారు..
Read Also: Colours swathi : ఆ సమయంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను.. కానీ
రాజమండ్రిలో 50 లక్షల రూపాయలు వ్యయంతో చేపడుతున్న జైళ్ల శాఖ ప్రాంతీయ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆమె.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఖైదీలను అర్థం చేసుకునే విధంగా జైలు సిబ్బందికి శిక్షణ ఉంటుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత. కాగా, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయించిన విషయం విధితమే.. ఇక, ఉమ్మడి కార్యాచరణ దిశగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి రెండు పార్టీలు.. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతో కొన్ని కీలక హామీలను ప్రకటించిన విషయం విదితమే.