NTV Telugu Site icon

YS Sunitha Reddy: టీడీపీలోకి వైఎస్‌ సునీత..? అసలు కారణం ఇదేనా..?

Ys Sunitha Reddy

Ys Sunitha Reddy

YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది.. విచారణ కీలక దశకు చేరుకుంది.. అయితే, ఈ సమయంలో వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు వైఎస్‌ సునీతారెడ్డి.. పొలిటికల్‌ ఎంట్రీపై ఓ పోస్టర్‌ కలకలం రేపుతోంది.. కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా వేసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి.. వైఎస్‌ సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రే పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ పోస్టర్లలో వైఎస్‌ వివేకానందరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌, వైఎస్‌ సునీతారెడ్డితో పాటు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇక, కడప జిల్లా నేతల ఫొటోలను పొందుపర్చారు.. వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్ ను రాజేసింది. రాజకీయ రంగప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మగారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు.

కాగా, సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయపోరాటానికి దిగారు వైఎస్‌ సునీతారెడ్డి.. తండ్రి హత్యకు కారణమైనవారికి శిక్ష పడాలనే సంకల్పంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పోరాటం చేస్తున్నారు.. ఈ కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.. ఏపీ నుంచి తెలంగాణకు కేసును మార్పించడంలోనూ ఆమె కృషి ఉంది.. తన తండ్రి హత్యలో నిందుతులు ఎవరైనా వారికి శిక్ష పడాలనే ధ్యేయంతో ఆమె ముందుకు సాగుతున్నారు.. ఈ సమయంలో తనకు బెదిరింపులు వచ్చినా ముందుకు సాగుతున్నారు.. మరోవైపు.. ఈ కేసు వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.. సునీతను నడిపిస్తుంది ఆయనే.. వ్యవస్థలను మెనేజ్‌ చేస్తున్నారు.. టీడీపీ నేతలు చెప్పినట్టే సీబీఐ విచారణ సాగుతోంది.. అనే విమర్శలను వైసీపీ నేతలు చేస్తూ వస్తున్నారు.. ఈ సమయంలో.. వైఎస్‌ సునీతారెడ్డి పొలిటిక్‌ ఎంట్రీని స్వాగతిస్తున్నాం అంటూ వెలిసిన పోస్టర్లు చర్చగా మారాయి..

అయితే, ఈ పోస్టర్లపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు.. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్లపై టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు.. వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారన్నారని మండిపడ్డారు. వైఎస్‌ వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు అంటించారని ఆరోపించిన ఆయన.. వైఎస్ సునీత పోస్టర్లు ఎవరు అంటించారో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. సునీతతో పాటు టీడీపీ నేతల ఫొటోలను కూడా పోస్టర్లలో వేశారు. ఆ పోస్టర్లతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇక, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ.. వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగేళ్ల వుతున్నా ఇంకా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ప్రొద్దుటూరులో వెలిసిన పోస్టర్లకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. వైసీపీ నాయకుల ఫ్రెస్టేషన్ లో ఏం చూస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారని భయంతో వైసీపీ డైవర్ట్ పొలిటికల్ డ్రామా ఆడుతోందని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు చివరి దశలో ఉంది.. ఈ సమయంలో వైసీపీ నాయకులు పొలిటికల్ డ్రామాలు మానుకోవాల్సిందిగా వైసీపీ నాయకులకు హితవు పలికారు ఆర్‌. శ్రీనివాసరెడ్డి. మొత్తంగా వైఎస్‌ సునీత పోస్టర్లు ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి..

Show comments