Site icon NTV Telugu

YS Viveka Case: హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై.. వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ys Viveka

Ys Viveka

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆయన పీఏ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య జరిగిన రోజు అక్కడ దొరికిన లేఖ గురించి వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు. లేఖ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి తనకు చెప్పాడని వెల్లడించాడు. లేఖ దాచిపెడితే పోలీసులు నుండి సమస్య వస్తుందని ఆ రోజు చెప్పానని అన్నారు. నేను చెప్పింది చెయ్ అని రాజశేఖర్ నాతో చెప్పాడని తెలిపాడు. నన్ను కేసులో ఇరికించి రాజశేఖర్ బయట ఉన్నాడని వెల్లడించాడు.

Also Read:Punjab: ‘‘ పాకిస్తాన్‌లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..

ఎంపీ అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఎవరు నడవట్లేదు.. సిబిఐ విచారణకు డిల్లీ వెళ్ళాలని రాజశేఖర్ సిబిఐ అదికారులకు కంటే ముందే చెప్పాడని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు. డిల్లీలో విచారణ ఉంటుందని సిబిఐ కంటే ముందే రాజశేఖర్ ఎలా చెప్పాడని ప్రశ్నించాడు. సిబిఐ ఏం చెప్తుందో రాజశేఖర్ కు ముందే ఎలా తెలుసని అన్నారు. డిల్లీలో సిబిఐ విచారణకు రాజశేఖర్ నాకు ప్లైట్ టికెట్స్ బుక్ చేశాడు.

Also Read:Airtel: దేశవ్యాప్తంగా 2000 నగరాల్లో IPTV సేవలు తీసుకరానున్న ఎయిర్‌టెల్.. ప్లాన్స్ లిస్ట్ ఇదే!

నన్ను ఢిల్లీకి పంపించిన వ్యక్తులు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.. సాక్షాదారాలతో సహా నేను మీడియా ముందు చూపిస్తున్నాను ఇవి అవాస్తవాలని మీరు నిరూపించగలరా.. అని ప్రశ్నించాడు. నా భద్రత కోసం గతంలో ఎస్పీని కూడా కలిశాను నా వెపన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు.. రెండు సంవత్సరాలు న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు.. నా కొడుకు రాజేష్ ను చిత్రహింసలకు గురి చేశారు.. సహకరించకపోతే నువ్వు జైలుకు పోతావు అంటూ సునీత బెదిరించిందని వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు.

Exit mobile version