Site icon NTV Telugu

YS Subba Reddy: కాంగ్రెస్‌ గూటికి వైఎస్‌ షర్మిల.. ఇలా స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

Ys Subba Reddy

Ys Subba Reddy

YS Subba Reddy: వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, మరికొందరు సీనియర్‌ నేతల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.. ఇక, కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆంధ్రలో అయినా.. అండమాన్‌లో అయినా పనిచేస్తానని ప్రకటించారు. అయితే, వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. ఇక, ఈ వ్యవహారంపై వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు.

Read Also: Karsevak Arrest: కరసేవకుల అరెస్ట్ పై బీజేపీ నేతల ఆందోళన

ఇక, వైఎస్‌ షర్మిల తో సహా ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పైనే ఉన్నాయి అన్నారు వైవీ సుబ్బారెడ్డి.. జగన్ కాకుండా వేరే వాళ్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని.. అందుకే ప్రజల ఆశీస్సులు మాతోనే ఉంటాయి అన్నారు. మరోవైపు.. లోకేష్ నావ మునిగి పోయింది, జాకీలు వేసి లేపుతున్నారు, అయినా లేవడం లేదు అంటూ ఎద్దేవా చేశారు వైవీ సుబ్బారెడ్డి.

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

మరోవైపు, నిన్న కొత్త ఇంఛార్జి పరచియ కార్యక్రమంలో అనకాపల్లి వీడుతున్నందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కన్నీళ్లు పెట్టుకున్న విషయం విదితమే కాగా.. మంత్రి ఉద్వేగంతో ఉండటంతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు వైవీ సుబ్బారెడ్డి.. మంత్రి భావోద్వేగంపై స్పందించిన సుబ్బా రెడ్డి.. 10 సంవత్సరాలు అనకాపల్లిని అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి భావోద్వేగం ఉంటుంది.. అందుకే ఇంటికి వెళ్లి అమర్ భావోద్వేగాన్ని పంచుకున్నాను అన్నారు. అమర్నాథ్‌కు ఇంతకంటే మంచి భవిష్యత్ ఉంటుందని కుటుంబ సభ్యులకు మాటిచ్చినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version