YS Subba Reddy: తిరుపతిలో తొక్కిసలాట ఘటన కలకలం రేపుతోంది.. అయితే, సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన జరిగిందని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వేంకటేశ్వరుని దయతో దర్శనాలు చేసుకుని వెళ్తారన్నారు.. కూటమి ప్రభుత్వం జరిగిన ఘటనపై స్పందించిన తీరు సరికాదని.. క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమన్నారు.. బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. టీటీడీ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందన్నారు.. ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. టీటీడీ చైర్మన్, ఈవోల మధ్య మనస్పర్థలు ఉంటే బయట చూసుకోవాలి.. కానీ, భక్తులను ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు.. రాబోయే రోజుల్లో తిరిగి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని అసంతృప్తితో ఉన్నారన్నారు.. పల్లెల్లో సంక్రాంతి క్షోభ కనిపిస్తుందని విమర్శించారు వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..
Read Also: Liquor Prices: పండుగ పూట మందుబాబులకు గుడ్ న్యూస్..