రైతు సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సీఎం చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం తెలిపిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సీఎంను కలిసేందుకు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వైఎస్ షర్మిల బయదేరారు. మెడలో ఉల్లిపాయల మాల వేసుకుని ట్రాక్టర్ ఎక్కారు. ట్రాక్టర్‌తోనే రోడ్డు మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
Also Read: IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
‘రైతుల గురించి ఎవరూ ఏపీలో మాట్లాడటం లేదు. ఒకప్పుడు రైతు గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టించుకున్నారు. రాజశేఖర రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారు. రైతులు ఆత్మహత్యల విషయంలో ఏపీ 3వ స్ధానంలో ఉంది. ఏపీలో రైతుకు అసలు భరోసానే లేదు. మాటలే చెపుతున్నారు కానీ ఏమీ చేయడం లేదు. మిర్చి, పొగాకు, జొన్న, పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఉల్లిపాయకు 1200 రూపాయలు ఇస్తామన్నారు, 400 కూడా మార్కెట్ ధర రావడం లేదు. ఉల్లి పంట పారబోసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళకుండా, సీఎం చంద్రబాబును కలవకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులను మోహరించారు. చంద్రబాబుకు మెమొరాండం ఇవ్వాలి, పోలీసులు ఓవరాక్షన్ చేసి అడ్డుకోవద్దు. యూరియా కూడా తెచ్చుకునే పరిస్ధితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు’ అని వైఎస్ షర్మిలమండిపడ్డారు .
