NTV Telugu Site icon

YS Sharmila Meets Pawan: పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన వైఎస్‌ షర్మిల

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila Meets Pawan: హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాలని ఆహ్వానిస్తూ పవన్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరుల వివరాలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు.

Read Also: Breaking: మరో 3 రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు..

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిలకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. రేపు సాయంత్రం హైదరాబాద్‌లో వైఎస్‌ రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజారెడ్డి మేనమామ, సీఎం జగన్‌ హాజరుకానున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

Show comments