NTV Telugu Site icon

CM Jagan: ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్ర..

Jagan Cm

Jagan Cm

ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. నైట్‌హాల్ట్‌ పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కలిశారు. ఇక, ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ దగ్గర ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పలువురు టీడీపీ నేతలు చేరారు. ఇందులో, వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిల భారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ ఉన్నారు.

Read Also: GHMC Hyderabad: పన్నులు కట్టకుంటే కఠిన చర్యలు.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

కాగా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో టీడీపీ మాజీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ రెడ్డ్యం వెంకట సుబ్బారెడ్డి జాయిన్ అయ్యారు. అలాగే, బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్‌ పంచాయితీ మాజీ సర్పంచ్‌ వీఎస్‌ కృష్ణమూర్తి(లాయర్‌ బాబు) సైతం వైసీపీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నల్లగట్ల, బత్తలూరు మీదుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది.