YS Jagan Pulivendula Visit: నేడు పులివెందులకు వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి..
- నేడు పులివెందులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
- ఎన్నికల ఫలితాల తర్వాత తన సొంత నియోజకవర్గానికి జగన్
- ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్న మాజీ సీఎం
- భవిష్యత్ కార్యాచరణ పై పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Pulivendula Visit: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నాఉ.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఇక, ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్ జగన్. సోమవారం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్.. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు..
Read Also: Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇప్పటికే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్తున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఉండబోతున్నారు. కాగా, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పులివెందుల నియోజవర్గానికి వైఎస్ జగన్ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అధైర్య పడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా, ప్రజల్లోనే ఉండేందుకు వైఎస్ జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఏం చేయాలన్న దానిపై ముఖ్య నేతలతో ఐదు రోజులపాటు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!