Site icon NTV Telugu

YS Jagan: మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన..!

Jagan Ys

Jagan Ys

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మోంథా తుపాను (Montha Cyclone) కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ (మంగళవారం) నాడు పర్యటించనున్నారు. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు, వారికి అండగా నిలబడేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. వైయస్ జగన్ పర్యటన కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వైయస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పత్రికా ప్రకటనలో తెలిపారు.

JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్‌గా మారిన పోస్ట్!

మోంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, గాలులకు పంటలు పెద్ద ఎత్తున నష్టపోయి రైతులు కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైయస్సార్సీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపించారు. గత 18 నెలల కాలంలో 16 సార్లు అల్పపీడనాలు, తుపాన్ల రూపంలో రైతులు పంటలు నష్టపోయినా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని పేర్కొన్నారు. దాదాపు రూ. 600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని వెల్లడించారు. వైయస్సార్సీపీ హయాంలో రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేలు, ఈ-క్రాప్ విధానాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గతంలో ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారని, ఇవన్నీ రైతులకు పెనుశాపంగా మారాయని పేర్కొన్నారు.

Ind vs Aus: దుమ్ము దులిపిన టీమిండియా బ్యాటర్లు.. దక్షిణాఫ్రికాకు భారీ టార్గెట్..!

మోంథా తుపాను రైతుల నడ్డి విరిచినా, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గానీ.. కార్యాచరణ గానీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా, సంఘీభావంగా జగన్ పర్యటించనున్నారు. రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్ని నాని, తలశిల రఘురాం స్పష్టం చేశారు.

Exit mobile version