YS Jagan: నేడు తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్!

  • నేడు తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్
  • సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసానికి వైఎస్‌ జగన్‌
  • మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పర్యటన
Ys Jagan

Ys Jagan

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి.. సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు.

Also Read: Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి

మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. ఉదయం 11.15 గంటలకు తెనాలి ఐతానగర్ చేరుకుంటారు. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.