Site icon NTV Telugu

YS Jagan: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన సైకోని ఈ ప్రభుత్వం పట్టుకోలేదు..

Jagan

Jagan

YS Jagan: మదనపల్లి జిల్లా నీరుగట్టువారి పల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాలిక హత్య మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా.. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ.కంబాల దిన్నెలో మూడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం, ఆపై హత్య.. తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం, ఆపై హత్య.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం.. ఎల్లో మీడియాను వాడుకుని హడావిడి ప్రకటనలు చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం.. మీకు రొటీన్‌ అయిపోయిందని జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?

అయితే, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయినా సరే వారి ఇళ్ల మీదకి పోలీసులను పంపి ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో హోంమంత్రి లా అండ్‌ ఆర్డర్‌కు బాధ్యత వహించరు, మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ, అందరి శాఖల్లో వేలుపెడతారు. ఏ మంత్రి దేనికీ బాధ్యత వహించరు.. ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు.. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే.. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు? అని జగన్ క్వశ్చన్ చేశారు.

Read Also: IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!

ఇక, మీరు సృష్టించిన పొలిటికల్‌ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? అని మాజీ సీఎం జగన్ ప్రశ్రించారు. చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి, అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నాయకడు మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం చేస్తే, కేసు కట్టి, అరెస్టు చేయాల్సిన పోలీసులు, మూడు రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపై హత్యాయత్నం కేసు పెట్టి, జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి ఇక రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది?.. చంద్రబాబు ఇకనైనా మేలుకో, తక్షణం లా అండ్‌ ఆర్డర్‌పైనా, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టండి అని వైఎస్ జగన్ సూచించారు.

Exit mobile version