YS Jagan: ఓ ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే.. కనీసం పోలీస్ భద్రత కూడా సీఎం ఇవ్వలేదు!
- గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్
- పెద్దగా భద్రత లేకుండానే యార్డ్‌లో రైతులతో జగన్ సమావేశం
- సెక్యూరిటీపై స్పందించిన వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి బయటపడింది. జగన్‌కు జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా.. ఆయనకు పోలీసులు కనీస భద్రత కూడా కల్పించలేదు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో దారిలో ఎక్కడా పోలీసులు పెద్దగా కనబడలేదు. పెద్దగా భద్రత లేకుండానే గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులతో జగన్ సమావేశం అయ్యారు. తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ మండిపడ్డారు.
మిర్చి యార్డ్ బయట మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో పరిస్థితి దిగజారిపోయింది. ఓ ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే.. కనీసం పోలీస్ భద్రత కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నెలకొంది. నేను చంద్రబాబు గారికి ఓ మాట చెబుతున్నా… ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. రేపు ప్రతిపక్షంలో మీరు కూర్చున్నపుడు ఇదే మాదిరిగా మేం పోలీసు భద్రత తీసేస్తే.. ఎలా ఉంటుందో ఓసారి ఆలోచన చేయండి. సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తారు. నేను చేసింది సరైందేనా కదా అన్నది సీఎం ఆలోచన చేయమని నేను చెబుతున్నా’ అని ఫైర్ అయ్యారు. జగన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
బుధవారం ఉదయం గుంటూరు మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్ వచ్చారు. మిర్చి రైతుల కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీస్ భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదు..- వైఎస్ జగన్#YSJagan #Guntur #GunturMirchiYard #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/JEpiZQBjXd
— NTV Telugu (@NtvTeluguLive) February 19, 2025
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!