Site icon NTV Telugu

YS Jagan: ఏపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై అభ్యర్థులతో వైఎస్ జగన్ భేటీ..?

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోబోతున్నారు. వరసగా నియోజకవర్గాల వారీగా నేటి నుంచి విడివిడిగా వైసీపీ నేతలతో జగన్ సమావేశం అవుతున్నారు.

Read Also: Janasena: పార్టీ నేతలతో పవన్ కీలక భేటీ.. జనసేన పక్షనేతగా ఎన్నిక..!

కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి పార్టీ అభ్యర్థుల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానిపై నేతలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా వారితో చర్చించే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల వారీగా నేతలతో వైఎస్ జగన్ నేటి నుంచి వరసగా సమావేశమవుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలకు కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.

Exit mobile version