YS Jagan: ఏలూరులో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ఈ ప్రభుత్వం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం.. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం.. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది.. జగన్ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు.. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమేనని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: Mana Shankara Vara Prasad Garu: స్కేల్, హైప్ అవసరమేలే.. కంటెంట్ బలంతోనే ఎంఎస్‌జీ ఇండస్ట్రీ హిట్!
ఇక, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను అని మాజీ సీఎం జగన్ తెలిపారు. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటాను.. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతాను.. ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నాం.. వారానికి ఒక నియోజక వర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం.. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు.. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే.. పరిపాలన చాలా అన్యాయంగా జరగుతుంది.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు.. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
Read Also: Drishyam 3: ‘దృశ్యం 3’కు గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
అయితే, పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది.. చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధపడుతున్నారు.. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్.. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం.. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు.. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారు.. సూపర్‌సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. అన్నీ మోసాలే.. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు.. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి, పిల్లలకు టోఫెల్ క్లాస్‌లు లేవు, గోరు ముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయిందని ఆరోపించారు.
Read Also:
అలాగే, పిల్లల ప్రాణాలు పోతున్నాయని జగన్ పేర్కొన్నారు. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవి.. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్ ఉండేది.. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారు.. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు.. ఫీజు రీయింబర్స్మెంట్ 8 క్వార్టర్లు పెండింగ్.. ఒక త్రైమాసికం అయిపోగానే, దానికి సంబంధించిన డబ్బులు జమ చేసే వాళ్లం.. 2024లో ఎన్నికలకు ముందు జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన త్రైమాసిక చెల్లింపు, ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది.. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో, అప్పటి నుంచి ఫీజుల చెల్లింపు లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టాం..10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.