YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీపై రగడ కొనసాగుతూనే ఉంది.. డీఎస్సీ లీకేజీలు, అక్రమాలపై గత 74 రోజులుగా దాదాపు 10 రకాల కార్యక్రమాలు నిర్వహించామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలన్నింటినీ ఇప్పటికే ప్రజల ముందుంచామని చెప్పారు. అంతే కాదు.. డీఎస్సీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికే ఫస్ట్ ర్యాంకు రావడం చూశామని జగన్ అన్నారు. మెరిట్ లిస్టులు మారిన వ్యవహారాలు కూడా బయటపడ్డాయని తెలిపారు. డీఎస్సీ లీకేజీ ఎంత దూరం వెళ్లిందో పూర్తిగా తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జగన్ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయా అని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ కోటాపై జగన్ ఆరోపణలు
స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెరతీశారని జగన్ ఆరోపించారు. పోటీ పరీక్ష లేకుండా, డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ తర్వాత మళ్లీ జీవోలు మార్చారని, అంటే గతంలో తీసుకున్న నిర్ణయం తప్పని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. ఇన్ని అక్రమాలు, ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి చంద్రబాబు కుమారుడే అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో నిష్పాక్షికత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
Also Read
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
రూ.12,400 కోట్ల ఫీజు బకాయిలు
వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై కూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 13 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఒక్కో త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.9,100 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. వసతి దీవెన కింద మరో రూ.3,300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కలిపి సుమారు రూ.12,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల తలరాతలు మార్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జగన్ ఆరోపించారు. ఈ బకాయిలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ సభ్యులకు సూచించారు. చర్చ కోసం పట్టుబట్టాలని, విద్యార్థుల తరఫున గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రైతుల సమస్యలపైనా పోరాటం
రాష్ట్రంలో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని జగన్ అన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని విమర్శించారు. పంటలు వేసుకోవాలని చెప్పి, రైతులు 40 శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. రైతులకు అండగా ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశారని జగన్ విమర్శించారు. రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారి సమస్యలపై శాసనమండలిలో గట్టిగా పోరాడాలని పార్టీ సభ్యులకు సూచించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించే విధానానికి కూడా ప్రభుత్వం మంగళం పాడేసిందని జగన్ ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి రాజీనామా, విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపు, రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!