Site icon NTV Telugu

YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. పులివెందులలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్

Ys Viveka Case

Ys Viveka Case

YS Bhaskar Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అవినాష్‌ అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. భాస్కర్‌రెడ్డిపై సెక్షన్ 130బి,రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం ఇచ్చి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. భాస్కర్ రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ స్పెషల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు.

Read Also: Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..

వివేకా హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అవినాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్‌ ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకుxof. తాజాగా భాస్కర్‌ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో అవినాశ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తొలుత హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి ఇంటికీ సీబీఐ అధికారులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే అక్కడికి ఎవరూ రాలేదని ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.

Exit mobile version