Site icon NTV Telugu

YS Bharathi: సీఎం జగన్‌కు అభివాదం చేసిన వైఎస్ భారతీ..

Ys Barathi

Ys Barathi

గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్ర చేసుకుంది. ఈ సందర్భంగా జగన్‌ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం నెలకొంది. తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బస్సు యాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి భారతీ అభివాదం చేయగా.. దానికి ప్రతిగా బస్సులో నుంచి సీఎం జగన్ అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి ఆమె అభివాదం చేశారు.

Read Also: Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు షాక్.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. అసలు ఏమైందంటే?

అయితే, కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర విజయవాడకు చేరుకోనుంది. దీంతో ప్రజలతో కలిసి ఏపీ సీఎం సతిమణీ వైఎస్‌ భారతి స్వాగతం పలికారు. ప్రజల మధ్యలో నుంచే ఆమె జగన్ కు అభివాదం చేయడంతో అక్కడ ఉన్న వారందరూ వైఎస్ భారతీతో సెల్పీలు, ఫోటోలు తీసుకునేందుకు భారీగా వచ్చారు. వారితో ముచ్చటిస్తూ.. వైసీపీకి మద్దుతుగా నిలవాలని కోరారు. దీంతో ప్రకాశం బ్యారేజీపై మేమంతా సిద్ధమని నినాదంతో మార్మోగిపోతుంది.

Exit mobile version