Site icon NTV Telugu

YS Bharathi: చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్‌ భారతి కౌంటర్‌.. వయసులో పెద్దవారు.. అలా మాట్లాడటం తప్పు..

Bharathi

Bharathi

YS Bharathi: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, కడప జిల్లా పులివెందులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోన్న సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు.. అలా మాట్లాడడం తప్పు అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని చంపాలి అనుకోవడం తప్పు అవుతుందన్న ఆమె.. ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి తప్ప.. ఇలా ఆలోచించడం ప్రజల దృష్టిలో.. దేవుడి దృష్టిలో.. చట్టం దృష్టిలో కూడా తప్పే అవుతుందన్నారు. ఇక, సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు విచక్షతకే వదిలేస్తున్నాం అన్నారు. ఏమైనా ఉంటే ప్రజలను మెప్పించుకోవాలని.. అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అంటూ ఫైర్‌ అయ్యారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version