NTV Telugu Site icon

YS Avinash Reddy : ఉక్కు పరిశ్రమ పనులు మొదలయ్యాయి…

Avinash Reddy

Avinash Reddy

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలను తెచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఆయన అన్నారు. జిందాల్ స్టిల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గండి కోట ప్రాజెక్ట్‌ ద్వారా 26 టీఎంసీల నీళ్లు నిలువ చేయగలిగాము కాబట్టి, ప్రజల దాహార్తి తీర్చగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. కడప రిమ్స్ లో మూడు రకాల ఆసుపత్రులు తెచ్చి ప్రజలకు వైద్యం చేరువ చేశామని ఆయన వెల్లడించారు.

Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..

కోవిడ్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని సీఎం ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు అని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండని ఆయన అన్నారు. జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలే ప్రచారంలో నీరాజనం పడుతున్నారన్నారు. సీఎం జగన్‌ చెప్పినట్లుగా వైనాట్‌ 175 అన్నట్లు ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగువేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌పై దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన అన్నారు.

Jasprit Bumrah: బుమ్రాను భయపెట్టిన భారత యువ బ్యాటర్‌.. వీడియో వైరల్!