Site icon NTV Telugu

Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..

Poolachokka Naveen

Poolachokka Naveen

యూట్యూబర్ పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా బృందం ఇటీవల సక్సెస్ మీట్ సైతం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ.. ఈ సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారని మండిపడ్డారు.

READ MORE: Hyderabad: ఇంటి దొంగ దొరికిందోచ్.. బెట్టింగ్‌కి బానిసై అన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ సోదరి..

“మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటివారు మా సినిమా నుంచి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయేప్పటికీ మాపై పగ పట్టి మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకు గాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కావాలని మా సినిమా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు. అలాగే మరికొందరు యూట్యూబ్ ఛానల్స్ సినిమా విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్గా రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేశాం. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది.” అని నిర్మాత వ్యాఖ్యానించారు.

READ MORE: Viral Video: స్టేటస్ లేక పిచ్చా..? చాండిలియర్‌గా ఫెరారీ కార్ ఏంటి భయ్యా..!

Exit mobile version