Site icon NTV Telugu

Bayya Sunny Yadav : భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు.? బయటపడ్డ కీలక విషయాలు..!

Sunny Yadav

Sunny Yadav

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్‌ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ.. కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తు్న్నారంటే సన్నీ వెనకు పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

READ MORE: Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?

ఇటీవల బైక్ రైడ్ చేస్తూ పాకిస్థాన్‌కు వెళ్లడంతో భయ్యా సన్నీయాదవ్ పై ఎన్‌ఐఏ నజర్ పెట్టింది. ఇప్పటికే జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్నట్లు తేలింది. భయ్యా సన్నీ యాదవ్‌ కూడా పాకిస్థాన్‌కి వెళ్లడం వెనుక.. జ్యోతి తరహాలో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌ నుంచి దుబాయ్‌కి చేరుకున్న సన్నీ, అక్కడి నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకోగా ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఎన్‌ఐఏ అధికారికంగా ధృవీకరించలేదు. చెన్నైలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయాలు ఉన్నాయి. కేవలం.. పాకిస్థాన్‌కు ఎలా వెళ్లాలనే అంశంపై ఆమెను కాంటాక్ట్ అయ్యాడా? లేదా జ్యోతి చెప్పడం వల్లే పాక్‌కు వెళ్లాడా? అనేది తేలాల్సి ఉంది.

READ MORE: IPL 2025 Final RCB: ఫైనల్ ముందు ఆర్సీబీ బలాబలాలు ఇవే.. టైటిల్ సాధించడానికి సరిపోతాయా..?

ఓ సారి పాక్‌కు వెళ్లేందుకు అటెంట్ చేసి ఫెయిల్ అయ్యాడు. రెండోసారి ఎందుకు తీవ్రంగా ప్రయత్నించాడు? పట్టుబట్టి మని పాక్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. భయ్యా సన్నీ కేవలం రైడ్ కోసమే పాకిస్థాన్‌కు వెళ్లి ఉంటే.. అక్కడ సమావేశాలు ఎందుకు జరిపాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో సన్నీ యాదవ్‌కి పక్కనే ఉన్న వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో అక్కడ ఎవరెవరిని ఎందుకు కలిశాడనే అంశంపై ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. పహల్గాం ఘటన జరిగినప్పుడు, భారత్ పాక్‌పై డ్రోన్‌లతో దాడులు చేస్తున్నప్పుడు భయ్యా సన్నీ పాక్‌లోనే ఉన్నాడు. ఇది కూడా అనుమానాలు తావిస్తోంది. అతడి తండ్రి మాత్రం తన కొడుకును ఎవరు తీసుకెళ్లారో తెలియదని, తనకు ఎలాంటి సమాచారం లేదంటున్నాడు. కోర్టును ఆశ్రయిస్తాడని తెలిపాడు.

 

Exit mobile version