Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anvesh Lookout Notice: ప్రసిద్ధ యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఆ వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పదంగా మారడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read
- Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
ఈ వ్యవహారంపై స్పందించిన పంజాగుట్ట పోలీస్ అధికారులు, అన్వేష్ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండడంతో దేశంలోకి ప్రవేశించిన వెంటనే అదుపులోకి తీసుకునేలా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ తన సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసి.. తనకు రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇందులో ఆయన ప్రధాన అకౌంట్‌ను ఇంస్టాగ్రామ్ బ్లాక్ చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్‌షిప్‌లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!
ఈ కేసు దర్యాప్తు భాగంగా, అన్వేష్‌కు సంబంధించిన అకౌంట్ల వివరాలు, వీడియోల సమాచారం అందించాలని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సంస్థలకు పోలీసులు అధికారికంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!