NTV Telugu Site icon

YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

Youtube Villege

Youtube Villege

ఈ విలేజ్ విశిష్టత ఏంటో తెలుసా.. అసలు అది ఎక్కడుంది అనుకుంటున్నారా.. అయితే చూద్దాం రండీ.. అది యూట్యూబర్ల గ్రామం.. అక్కడ జనాభా 3000 మంది.. అయితే వారిలో వెయ్యి మంది యూట్యూబర్లు ఉన్నారు. దీంతో ఆ ఊరి సర్పంచ్ కూడా యూట్యూబర్లకు గ్రామ పంచాయితీ తరపు హెల్ప్ చేస్తున్నారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా చర్చకు వచ్చిన ఆ విలేజ్ ఎక్కడుందంటే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ జిల్లాని తహసీల్ లోని తులసి గ్రామం. ఆ ఊరి సర్పంచ్ గులాబ్ యాదవ్ యూట్యూబర్లకు అండగా నిలుస్తున్నాడు. దీంతో ఈ గ్రామానికి చెందిన యూట్యూబర్లు దేశాన్న, ప్రపంచాన్ని అలరించే కంటెంట్ ని సృష్టిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం కూడా అంతంతే ఉండే తులసి గ్రామంలో యూట్యూబర్ల సమాచార విప్లవం యావద్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read : Chennai Academy: విద్యార్థుల నిరసనలు.. చెన్నై కళాక్షేత్ర ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు

గ్రామంలో అందరూ ఎందుకు వీడియోలు చేస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదని తులసి గ్రామ సర్పంచ్ గులాబ్ యాదవ్ అన్నారు. మెల్లగా అన్నీ అర్థం కావడం మొదలయ్యాయి. తర్వాత డబ్బు, కారు, లొకేషన్ లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. మేము వారికి అవసరమైన అన్ని సహాయాలను వారికి అందించాము.. ఈ రోజు గ్రామంలోని ప్రతి ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు అని చెప్పారు. కంటెంట్ క్రియేషనర్ ఇప్పుడు పూర్తి సమయం వృత్తిగా మారినందున.. తులసి గ్రామ యూట్యూబర్లు దీన్ని అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

Also Read : Police: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన జైవర్మ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో పార్ట్ టైమ్ టీచర్ గా పనిచేశాడు. అక్కడ అతను నెలకు 12 వేల నుంచి 15 వేల వరకు సంపాదించాడు. కానీ యూట్యూబ్ లో అతడికి ప్రతినెల దాదాపు రూ. 30 వేల నుంచి 35 వేల వరకు వస్తున్నాయి. ఊరిలోని ఇలాంటి వారి అడుగుజాడలను అనుసరించి, ఇతరులు కూడా యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించారు.

Also Read : US NATO Ambassador : నాటోలో భారత్ కు చోటు..? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్

మహిళా కళాకారిణీ పింకీ సాహు యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఏడాదిన్నర గడిచంది. ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు 40 యూట్యూబ్ ఛానెల్ లు ఉన్నాయి. ఊరిలోని అమ్మాయిలకు కూడా యూట్యూబర్లుగా మారడానికి బాగా ఎంకరేజ్మెంట్ లభిస్తోందని పింకీ చెప్పింది. ఈ ఊరి నుంచి ప్రసారం అవుతున్న బీయింగ్ ఛత్తీస్ గర్హియా అనే యూట్యూబ్ ఛానెల్ కు 115కే సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ 200కి పైగా కామెడీ వీడియోలను రూపొందించింది. వీళ్లు కామెడీ వీడియోలతో ప్రజలను నవ్విస్తూ ముందుకు సాగుతున్నారు.

Show comments